ఓ జనని! దేశం నీ నిర్దేశం కోసం ఎదురుచూస్తోంది

ఓ జనని! దేశం నీ నిర్దేశం కోసం ఎదురుచూస్తోంది

अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥

అజ్ఞానమనే చీకటిని జ్ఞానం అనే వెలుగుతో ఉద్ధరింపచేసే గురువుకి పాదాభివందనం…

ఏ ప్రాణికైనా మొదటి గురువు తల్లే.. తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన బిడ్డని గర్భమనే(చీకటి) అజ్ఞానము నుండీ ఎంతో ప్రసవవేదన అనుభవిస్తూ తన బిడ్డని కని ప్రపంచం(వెలుగు) అనే జ్ఞానాన్ని ప్రసాదించి ఉద్ధరింప చేస్తుంది.. అందుకే తల్లిని మొదటి గురువుగా పూజించి గౌరవ స్థానాన్ని ఇచ్చారు.. ప్రతి గొప్ప శక్తి తన వెంట గొప్ప బాధ్యత తీసుకువస్తుంది.. ఆ బాధ్యత నిర్వహించడానికి ఎంతో క్రమశిక్షణ నియమ నిష్ఠలు అవసరము.. ఆలా వారి పాత్రని సక్రమంగా నిర్వర్తించి ఈ జాతిని ఉద్ధరించిన ఎందరో స్త్రీమూర్తులకి పాదాభి వందనం చేస్తూ.. వారి ప్రేరణ తో రాసిన పలుకులే ఈ మాటలు:


స్త్రీ అంటే పుట్టుక బట్టి స్త్రీమూర్తిగా పరిగనింపబడరు… స్త్రీ యోక్క ధర్మ మూలం స్త్రీతత్వంగా చేప్పబడింది..

ఏప్పుడైతే స్త్రీ తన ధర్మమూలం ఎరిగి, తనలో స్త్రీతత్త్వ౦ ఆవిష్కరింపచేసుకోని, దర్శించనప్పుడే… స్త్రీ ఓ దేవతగా మరియు స్త్రీమూర్తిగా ఆవిష్కరణ జరుగును… అంతవరకు స్త్రీ కేవలం నాటక రంగంలో స్త్రీ వేషం వేసుకున్న వేషధారిణిగానే పరిగణించపడుతారు..

ఓ స్త్రీ! స్త్రీ-పురుష సమానతలనే అసమానతలతో పోటి పడి పోటి పడి… ఆ పురుషుడి పుట్టకకు మరియు పురోగతికి కూడా కేవలం సభ్యత మరియు సంస్కారం అనే అమృతమును పంచిన నీ యదే, ఆ పురుషుడి మూల శక్తికి కారణం అని మరిచి…

పురుషుడిగా చలామణి అవుతూ, పురుషవేషoతో మోక్షస్థానమైన నువ్వు అసభ్యత కుసంస్కారాన్ని సమాజానికి పంచుతూ.. నిన్ను నువ్వే దిగజార్చుకుంటూ .. నీ విగ్నతను, ఔనత్యాన్ని మరుగున పడివేస్తావు ఏందుకు

ఓ మాత! నారాయణుడి స్త్రీతత్త్వం పూర్తి ఆవిష్కరణే నారాయణి అవతారం.. నారాయణి రూపమైనా పార్వతి పురుషావతారమె నారాయణుడు అని తెలుసుకో.. అలాగే అర్ధనారీశ్వర తత్త్వంలో ఆ శివుడు వేరు శక్తి వేరుకాదుఅని…. ఆ శివుడికి సైతం ప్రేరణ ఆ నారాయణినే కదా…..

ఆ శక్తి స్వరూపిణే ఈ విషయం చాటుతుంటే నువ్వు ఎందుకు అసమానతలనే సందేహలలో కోట్టుమిట్టాడుతావు … నీ హృదయం కామస్థానం కాదు జన్మస్థానం, జ్ఞానస్థానం మరియు మోక్షస్థానం అని చాటు అరిషడ్వార్గాలతో పీడించపడుతున్న ఈ జాతికి..

తల్లి! నీవే ఈ సామాజ అంతరంగ ఆత్మ శక్తి ఉద్భవ ఉత్తేజిని..అంతర్భాగిని.. స్వరరూప స్మరుద్దిని … భావ శక్తి ప్రేరేపిత భవానీ.. శక్తి సుశక్తి ప్రదాయని.. సర్వాంగ సాధ్భావ సంస్థాపిని..ఆనందందమై చింతలేల తల్లీ….

జనని! నీవే భారతదేశ వైభవానికి మూలం.. శారదాంబవై జగద్గురువైన ఆదిశంకరాచార్యులవారిని నిర్దేశం చేసినట్టుగా.. ఈ సమాజ అజ్ఞాన తిమరాలని పారదోలి, దేశానికీ జ్ఞాననిర్దేశం చేయటానికి ఎందరో మహనీయులని నీ హృదయాంతర్గత శక్తి నుండి సృష్టి చేసి దేశానికి దిశా నిర్దేశం చేయి.. దేశం నీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తోంది…


Add your thoughts

avatar
  Subscribe  
Notify of

Start typing and press Enter to search

Shopping Cart