ఓ భారతమా! నవవిప్లవం దారి ఎటు!
సలామ్ దొరా అంటూ బానిసత్వపు సంకెళ్ళలో బందీవై ఎన్నాళ్ళు నిన్ను నీవు ఖైదు చేసుకోని ఉంటావు, నిలువెత్తు అగ్ని గుండమైన సోధరా !
కాష్టమై బానిసత్వాన్ని హవిస్సుగా చేసి కాల్చివేస్తావో లేదా,బానిసత్వమనే కాష్టoలో నీవే హవిస్సువై కాలిపోతావో తేల్చుకో .. ఎందుకంటే జీవితము నీకు నువ్వే ఆదర్శంగా మార్చుకోని బ్రతకమని దేవుడు ఇచ్చిన వరము….
ఉద్యమించు ఉదయభానుడా నవవిప్లవానికి నాంది పలుకు …
ఓ మిత్రమా ! విప్లవం అంటే కేవలం అసహనపు చావుల, పరువపు పొదల్లో పుట్టినది కాదు విప్లవం అంటే…
ధర్మం అనే ఆదర్శాల గర్భం నుండీ పుట్టి అసమానతలనే హిరణ్యకశ్యపులను చీల్చివేయటానికి జ్వాలా నరసింహo వంటి విరాట స్వరూపమే విప్లవం.
విప్లవం అంటే, ఊహల్లో ఊరేగే నవరసములను మరిపించే “నా” అనే బానిసత్వపు సంకెళ్ళను తుంచి వేసే నవ్యమైన అయుధముగా అవతరింప చేసే సారూప్యశక్తే విప్లవం అని తెలుసుకోని నవవసంతమునకు నాందీ పలుకు …
ఎందుకంటే ఉద్యమించే హ్రుదయమ మత్రమే బానిసత్వo అనే రాత్రిని తరిమివేయగలదు.. ఉద్యమం అంటే అంతర్మథనము.. ఇదే సత్యము.. ఇదే సత్యాన్వేషణకు మార్గదర్శకం..
నీలోని అసమానతలనే గెలవలేని అప్రయోజకుఁడవు సమాజములోని అసమానతలని సరిచేసి ధర్మప్రతిష్ఠాపన ఎలా చేయగలవు!
విప్లవo అంటె వెలుపల ఉన్నా వ్యవస్థపైన పోరాటం మాత్రమే కాదు! మన లోపల పొగరుతో వెర్రిభుసలు కొడుతూ నీచ ప్రవృత్తిని ఆధారంచేసుకున్న అలోచనా వ్యవస్థపైన పోరాటమే విప్లవము..
విచక్షణ చేకూర్చుకొని.. లే.. మేలుకో.. స్వయం జాగురుతుడవై నీ వ్యక్తిత్వాన్ని జాగృతం చేస్తూ జాతిని జాగృతం చేయడానికి బయలుదేరు, బాటసారిగా కాదు శత్రుసైన్యాన్ని చీల్చి చెండాడే త్రివక్రముడిలా దూసుకుపో !
గెలుపోటములకు అతీతుడై సాగిపో!
ఉవ్వెత్తున ఎగసే కెరటాలకి నిశ్వార్థపు సంకల్పం చేసిన హ్రుదయానికి తిరుగు అలుపు లేదు తెలియని తపన తెలిసిన ఆకలి రెండూ కనిపించవు కానీ వాటి ప్రతాపము మరియు పరివర్తన మాత్రమే కనిపిస్తుంది..
ఇదే విప్లవం అంటే, ఇదే నవ భారత నిర్మాణానికి తారకమంత్రము..
Add your thoughts