జాతి కోరే జాతీయత
ఓ నేస్తమా నీరుగరే జ్ఞాపకాలని కావాలి కాచుకుంటూ, కుంగిపోతూ, కుమిలిపోతూ వాటికి బానిసై కూపస్థమండూకము వలె జీవితాన్ని.. అభేద్యమైనవిగా అగుపడే అరిషడ్వార్గాలనే కోటలను నీ చుట్టూ కట్టుకొని , నిస్సహాయత అనే సైనికుల్ని పెట్టి, ఎన్ని రోజులని ఏలుతావు జీవం లేని జీవత్సవం లాంటి మరియు శిలలేని గుడి లాంటి ఈ జీవితాన్ని..
నిన్ను కన్న ఆ గర్భం నిన్ను చీదరించుకునే లోపు జాగురూకుడవై మన్నులోన మాణిక్యాని వై వెలుగు.
ఈ జాతిని జాగృతం చేయడానికి, నిస్సహాయత అనే కౌరవ సమూహాన్ని చీల్చి చన్డాడు.. అరిషడ్వర్గాలనే పద్మవ్యూహం లాంటి కోట గోడలను బద్దలు కొట్టడానికి కృష్ణుడిని రథసారతిఁగా చేసుకుని దూసుకు వచ్చే సవ్యసాచివైరా ..
జాతి నీ రణ హుంకారం కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంది…
ఇదే నీ అభ్యుదయం మిత్రమా..
Add your thoughts