నీ ముత్యం నీ ఇష్టం
ప్రతి మనిషి మొహమనే మాయ లో పడి లేవడం సహజమే.. కానీ ఆ మొహమే జీవనం కాదు. ఈ తాత్కాలికాన్ని యెరిగి ఉన్నత ఆశయాలు ఏర్పరచుకొని ఉన్నతంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఫలితాలు రాకున్నా పర్వాలేదు మిత్రమా ప్రయత్నలోపం లేకుండా చూసుకో. గెలిస్తే పథకాలు మిగులుతాయి ఓడిపోతే అసహనపు మాటలు మిగులుతాయి. నీ ఈ ప్రయాణానికి గెలుపు ఓటములు ప్రమాణాలు కాదు, ఉన్నతమైన ఆశయము దానిని చిత్తశుద్ధితో ఆచరణ చేసే మనసే ప్రమాణం… ఈ క్రమం లో స్ఫురించిన న ఈ ఆలోచనే
ఈ రచన:
ఎడారి మండుటెండలో ఒక్క చుక్క నీటి గుటక కొరకు తారసపడే నా ప్రాణాన్ని, ముత్యపు చినుకులలో జోలలాడించిన ఓ సాక్షి..
ఆ జోలలే కవితలై కవ్వించే ముత్యాన్ని మదిలో మొలిపింపచేసి, మోహపు మధువులో సమయాన్నే మరిపింపచేసిన ఓ సుందరేశ్వరా!!
అకస్మాత్తుగా తపో భూమిని కమ్ముకున్న రక్షాస ప్రళయ మారుతం వాలే నా మదిన అలజడి రేపి, టక్కున మేలుకొలిపి!
మధు మలుపులు ముగిసాయి అని, ఇది ఓ మురిసే మాయ అని..
నా మదిన నిలిపిన ఆ ముత్యాన్ని తిరిగిఇవ్వమని. ముత్యపు మదిలో సేద తీరుతున్న నా మదిని, మనవి కూడా సేయక ఆ ముత్యపు మది నీ సొంతమని టక్కున లాక్కున్న ఓ లోకేశ్వరా!
నేనంటే నీకు ఎందుకు అంత లోకువ !
నీవు ముందే అడిగి ఉంటె మదిన ఏ ఊసు నాటకుండా, మరియు మదిన ఏ అనురాగపు దోషమును ఆపాదించక.. అర్పించనా నీ పాదదాసుడై నీ ముత్యం నీ ఇష్టం అని!!
Add your thoughts