మేలుకో – ఓ మహోదయం ఎదురుచూపు
జీవితంలో అందరూ తప్పులు చేయడం సహజమే .. తప్పు అని తేలిసి చేసే వాళ్ళ శాతమే ఎక్కువ.. తప్పు అని తేలిసిన మనల్ని మనమే సర్దిచెప్పుకొని మరి తప్పులు చేస్తుంటాము.. ఈ కోవాలో ముఖ్యంగా యువత శాతం ఎక్కువగ ఉంది.. ఇలాంటి ప్రస్థితులకు సమధానమే మీరు వీనబోయే ఈ మాటల హారం…
నీకు నువ్వే ఒక ఊహల మేడలు అంతులేని స్థాయి లో కట్టుకొని..
అది ఒక మాయ కాదు, అది వాస్తవం అనే అవాస్తవంతో నిన్ను నువ్వే సర్దిచెప్పుకొని మోసం చేసుకుంటూ..
అది నువ్వుగా అవ్వడానికి అసహనం అనే శక్తిని చేకూర్చుకుంటూ, ఉవ్వెతున ఎగురుతూ ఎదుగుతున్నావు అని బ్రమలో బతుకుతున్న ఓ మిత్రమా…
నువ్వు బ్రతికే ఈ బ్రతుకు ఒక మిథ్య అని, బూటకము అని తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తావ్ ఎందుకు… నిన్ను నువ్వే ఉల్లఘించుకుంటూ ఎవరికోసం ఈ జీవత్సం లాంటి బ్రతుకు..
అది నీ బలహీనత అని తెలుసుకో .. ఇది నీవు జీరించుకోలేకపోయిన, సత్యం అని యెరుగు. లేదంటే కాలగతి లో కనుమరుగు కాగలవు సోదరా…
ఎరిగి కూడా ఎరగనట్టు నటించడానికి ఇది నాటకరంగం కాదు… ఇది కర్మ సిద్ధాంతాన్ని ఆచరింప చేసే జగన్నాటకసూత్రధారి జగన్నాటకం అని తెలుసుకో. ఎవరి కన్ను కప్పిన అతగాడి కన్ను కప్పలేవు ..
వెలుతురుకై ఆరాటపడి అగ్నిలో కాలిపోయే ఒక పురుగులా నీ జీవితాన్ని నీవే కాల్చుకోవడం అది ఏమి సరదా అది ఏమి పిచ్చితనము …
నీ జీవితాన్ని కావాలి కాస్తున్న ఆ దేహ ప్రాణ ప్రదాతలైన తల్లితండ్రుల ఆశల గుండెలు నిరాశలనే కాష్టం లో కాలే లోపు మేలుకో….
ఇప్పటికైనా జాగృతంకా.. నీ జాగ్రతుం కోసం ఈ జాతి కాయలు కట్టిన కళ్లుతో కాచు కోని ఉంది…
ఇది నా వినత కాదు! నీకు నువ్వే ఇచ్చుకోవాల్సిన ఆజ్ఞగా మలుచుకో..
ఓ నేస్తమా ఇది సరిదిద్దుకోవడం తప్పు చేసినంత సులువు కాదు.. తప్పు చేసేటప్పుడు ఉండే దర్జాను , సరిదిద్దుకోవడం అనే మహత్కార్యం చేసేటప్పుడు ఎందుకు సిగ్గుతో దాచుతావ్!
పశ్చాత్తాపములో అసహనానికీ చోటు ఇచ్చి.. పోరాటానికి ధైర్యం చాలక మరణం ఒక్కటే మార్గమనుకొంట అది నీ వెర్రితనము..
అసహనం అనే కాలనాగులు బుసలకు బెదరక ఒక అమృతం తాగిన సైనికుడిలా, కృష్ణుడిని ధైర్యంగా చేసుకున్న అర్జునిడి లా పోరాడు…
“మరో మహోదయం నీ కోసం ఎదురుచూస్తోంది..”
ఆ మయా రూపి అయిన నిస్సాహాయతకి, నీవు లేచేపడే కడలి కాదని లయం చేసే పశుపతివైన త్రివిక్రమ రూపమని చాటు..
ఎప్పటికి విజయం నీ సొంతం.. జై హింద్..
👌👏 very nice